గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై ఇద్దరు దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన నగరంలోని కలపూర్ ప్రాంతంలో మధ్యాహ్నం జరిగింది. కత్తిపోట్లకు గురైన వ్యకత్ి కొద్ది నిమిషాల తర్వాత చనిపోయాడు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.