ఏపీలో బలపడాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అక్కడి రాజకీయ సమీకరణలను అవకాశాలుగా మల్చుకోవాలని చూస్తోంది. ఇదిలావుంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. త్వరలోనే బీఆర్ఎస్లో చేరబోతున్నారనే వార్తలు.. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మనస్థాపం చెందిన కోటంరెడ్డి.. వైఎస్సార్సీపీలో ఉండలేను అంటూ.. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కోటంరెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ.. మాత్రం బీఆర్ఎస్లో చేరేందుకు డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారని తెలుస్తోంది. వారు బీఆర్ఎస్లో చేరాలని కోటంరెడ్డికి ఆహ్వానం పంపినట్టు సమాచారం. దీనికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. కోటంరెడ్డి బీఆర్ఎస్లో చేరడంపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇటు KCR జాతీయ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఏపీపైనా దృష్టి పెట్టారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఏపీకి చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరారు.