తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్ రవాణా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరి, కొత్తూరు మీదుగా వేపనపల్లి, మొట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ రవాణా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ స్మగ్లర్లపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు.