రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి షాకిచ్చింది. వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా, 6.25 శాతానికి చేరినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్బీఐ రెపోరేటును ఇప్పటికే గత రెండుసార్లు పెంచగా, తాజా పెంపుతో అన్ని రకాల వడ్డీ రేట్లు మళ్లీ పెరగనున్నాయి.