గ్రామాల్లో స్వచ్ఛంద సం స్థలు ఏర్పాటు చేసే ఉచిత వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగ్గయ్యపేట ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జి కె. శ్రావణి, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఎమ్. శోభారాణి పేర్కొన్నారు. జగ్గయ్యపేట రూరల్ మండలం చిల్లకల్లు గ్రామంలో న్యూ హోప్ స్కూలులో న్యూహోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే ఉచిత మెగా కంటి, దంత వైద్య శిబిరాన్ని మంగళవారం జడ్జిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో న్యూ హోప్ మినిస్ట్రీస్ గత 20 సంవత్సరాలుగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైద్యశిబి రాన్ని సందర్శించిరోగులతో మాట్లాడారు. మొద టిరోజు 1500 మందికి పైగా రోగులు కంటి, దంత పరీక్షలు చేయించుకున్నారు. గుంటూరు శంకర్ నేత్రాలయం, ఖమ్మం మమత మల్టీ స్పెషాలిటీ వైద్యులు, అమెరికన్ వైద్యులు రోగులను పరీక్షిం చారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ ముత్తినేని విజయశే ఖర్, ఎంపీడీవో జయచంద్ర, ఎస్ఐ దుర్గాప్రసాద్, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ, న్యూ హోప్ మినిస్ట్రీస్ ప్రభుదాస్ రూత్, కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు నంబూరి రవి, తదితరులు పాల్గొన్నారు.