వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈ నెల 10న విడుదల చేయనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. గతేడాది అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 మధ్య వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతులకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50వేలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగుల వివాహానికి రూ.1.50 లక్షలు ఇవ్వనున్నారు.