కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓగా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. కె.సత్యనారాయణ రాజును కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓగా కేంద్రం నియమించింది. ఎల్వీ ప్రభాకర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సత్యనారాయణ రాజు 1988లో విజయ బ్యాంకుతో తన బ్యాంకింగ్ కెరీర్ ను ప్రారంభించి, BOBలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వరకు చేరుకున్నారు. అనంతరం 2021 మార్చి 10 వరకు కెనరా బ్యాంకులోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు.