టర్కీలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశంలో మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించనున్నట్లు దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. శిథిలాల కింద పడి చనిపోయిన 5,100 మందిని గుర్తించినట్లు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. 7 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని నిర్ణయించారు. ఈ విపత్తులో వేల మంది గాయపడ్డారని, పదివేల మంది నిరాశ్రయులైనట్లు తెలిపారు.