మన దేశంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు ఓ మహిళపై దాడి చేస్తారు. పక్కనున్న వారు ఆపేందుకు యత్నించినా వినకుండా మహిళ జుట్టు పట్టుకొని మరీ దాడి చేశారు. ఈ ఘటన యూపీ లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది.