నెల్లూరు జిలా, బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఒక స్కూటరిస్టు మృతిచెందాడు. ఆత్మకూరుకు చెందిన రహీం (50) తన కుమారుడిని బైక్పై నెల్లూరులోని కళాశాలలో వదిలిపెట్టి తిరిగి వస్తుండగా దామరమడుగు వద్ద ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెతో బైక్పై రోడ్డు దాటుతుండగా రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రహీంకు తీవ్ర, ఆ తండ్రీ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. రహీంను 108లో నెల్లూరుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వీర ప్రతాప్ తెలిపారు.