టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 9మంది టీడీపీ కార్యకర్తలపై నమోదైన కేసును జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు కొట్టివేసింది. అనంతపురం జిల్లా, చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామానికి 2021 మార్చి 21న మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్, టీడీపీకి చెందిన పలువురు వెళ్లారు. ఈ క్రమంలో ఆ రోజు గ్రామంలో జరిగిన ఓ వివాదానికి పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 9 మంది కారకులయ్యారని, దాడి చేసి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తిని వెంకటరాముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మంగళవారం జూనియర్ సివిల్‌జడ్జి రమ్యసాయి మంగళవారం కేసును కొట్టివేసినట్లు న్యాయవాది సుబ్బారావు, సీకేపల్లి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కేసు తుది విచారణకు పరిటాల శ్రీరామ్‌తోపాటు మరో 9 మంది ధర్మవరం కోర్టుకు హజరయ్యారు.