గుత్తి, పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కళాశాల సమీపంలో రైలు నుంచి కింద పడి రవితేజ(23) అనే యువకుడు మృతిచెందినట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప మంగళవారం తెలిపారు. మండలంలోని కొజ్జేపల్లి గ్రామానికి చెందిన రవితేజ హైదరాబాదులో జీబీసీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచే స్తున్నాడు. అతను పనిమీద ధర్మవరానికి వెళ్లి గుత్తికి రైలులో వస్తుండగా సోమవారం రాత్రి ఽఎంఎస్ డిగ్రీ కళాశాల సమీపంలో రాగానే డోర్ వద్ద నిలబడి ఉండటంతో అతను ప్రమా దవశాత్తు కిందపడి మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మృతదే హాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.