ఆర్థిక మాంద్యం భయంతో టెక్ దిగ్గజాలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ జూమ్ చేరింది. 1300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 15 శాతమని సీఈఓ ఎరిక్ యువాన్ తెలిపారు. తొలగించబడ్డ అమెరికన్ ఉద్యోగులకు నాలుగు నెలల జీతాన్ని, బోనస్ ను ఇస్తున్నామని, విదేశాల్లోని ఉద్యోగులకు కూడా ఇదే వర్తిస్తుందని తెలిపారు.