ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలపై పన్నుల భారాన్ని ప్రభుత్వం మోపింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 12:48 PM

వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జనజాగృతి యాత్రలో భాగంగా దావులూరిపాలెంలో పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాలనతో పాటు పేద ప్రజల స్ధితిగతులను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ.....  విద్యుత ఛార్జీలు, నిత్యావసర ధరలను విపరీతంగా పెంచివేసి సామాన్యులపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. రైతుల పరిస్థితి చూస్తే మరింత దారుణంగా మారిందన్నారు. రైతు భరోసా కేంద్రాల వలన ఏ ఒక్క రైతుకు న్యాయం జరగటం లేదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com