గుంటూరు, రేపల్లె: నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామములో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోభాగముగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను బుధవారం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ విద్యను అందిస్తుందన్నారు. భోదన, భోదనేతర సిబ్బందితో మాట్లాడి వారికున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.