శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం హనుమంతపల్లిలో బుధవారం మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం నుండి వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మీకు ఏవైనా సమస్యలు ఉంటే సచివాలయాల వద్దకు వెళ్లాలని ప్రజల సేవలు అందించడానికి సచివాలయాలను, వాలంటీర్లను నియమించినట్లు వారు తెలిపారు.