తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ డి.ఎస్ నగర్ లో బుధవారం జరిగిన " గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ పాల్గొని స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల జ్యోతి పద్మజ, తూర్పు వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.