ఎస్. రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో హైవే పక్కన పంట పొలాల్లో పొద్దుతిరుగుడు అందాలు ప్రయాణీకులను ఎంతో ఉత్సాహపరుస్తున్నాయి. దాదాపు రెండెకరాలలో రైతులు పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు. ప్రతీరోజు ఉభయ సంధ్యలలో వికసిస్తున్న పొద్దు తిరుగుడు తోటల్లో చాలా మంది తమ వాహనాలు ఆపి ఆ అందాలను తమ కెమెరాలలో బంధించుకుంటున్నారు. చూసే వారంతా వాట్ ఏ సీన్ అంటూ ముచ్చట పడుతున్నారు.