ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మంగళవారం నర్సీపట్నం శ్రీ కన్య సెంటర్ నుండి కేంద్ర ప్రభుత్వ పోస్టల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ కూలి పని చేసుకుంటున్న నిరుపేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పేదవారిని మోసం చేసే విధంగా పరిపాలన చేయడం ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని దుయ్యబట్టారు. కాగా ఉపాధి చట్టాలను ఉల్లంఘిస్తూ పేదవాడి కూలి డబ్బును కేంద్ర బడ్జెట్లో కోత పెట్టడం అనేది చాలా సిగ్గుచేటని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 30 కోట్ల జాబ్ కార్డులకు పని కల్పించాలంటే రెండు లక్షల 40 వేల కోట్ల రూపాయల అవసరం ఉందని, గత బడ్జెట్లో 89, 400 కోట్లు కేటాయించి ఈ సంవత్సరం గాను కేవలం 60 వేల కోట్లు మాత్రమే కేటాయించడం. 29, 400 కోట్లు తగ్గించడం చాలా దారుణమని అన్నారు.