నిత్యం పని ఒత్తిడికి గురవుతున్న ఆశ వర్కర్లకు ప్రభుత్వం నెలవారి జీతం 26 వేలు చొప్పున అందించాలని సిపిఎం పార్టీ నాయకులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మేదరమెట్లలో లోకల్ యాప్ తో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలలో ఆశ వర్కర్లను సర్వేల పేరిట పని చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వడం లేదని అన్నారు. ఆశ వర్కర్లకు గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఆంజనేయులు కోరారు. అలాగే అందరి ఉద్యోగులతో పాటు వచ్చే రాయితీలను ఆశ వర్కర్లకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.