పాయకరావుపేట మండలం పెద్దూరు బీచ్ లో మంగళవారం సముద్ర స్థానానికి వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. బుధవారం ఆ యువకులు మృతదేహం పెద్దూరు సమీపన రత్నాయం పేట తీరం ఒడ్డున లభించింది. కాకినాడ మధురానగర్ కాలనీకి చెందిన రిత్విక్ (24) మంగళవారం పెద్దూరు బీచ్ లో స్నానానికి వచ్చి గల్లంతయిన విషయం తెలిసిందే. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాయకరావుపేట సిఐ అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.