బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నిధులతో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులలో అవినీతి దాగి ఉందన్నారు. పనులన్ని నాసిరకంగా జరుగుతున్నాయని పనులలో నాణ్యత లోపించిందన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఫిట్ పర్సన్ ఇతర అధికారులు పనుల నాణ్యత పై దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.