గతంలో పింఛను పొందుకోవాలంటే రోజుల తరబడి పంచాయతీ దగ్గర పడిగాపులు కాసేవారని, అలాంటిది జగన్ ప్రభుత్వం లో తెల్లవారుజామున ప్రతి ఇంటికి వెళ్లి పింఛను అందిస్తుంటే చులకనగా చూడొద్దని, వాలంటీర్ అపోహలతో అకారణంగా విమర్శలకు చేయడం భావ్యం కాదని, వాలంటీర్లు పరాయి వాళ్లేమి కాదని వాళ్ళందరు మన అన్న, తమ్ముడు, అక్క, చెల్లెమ్మలేనని మీ మీ పరిధిలో 50 ఇల్లాలకు సేవ చేయడానికి మీలో ఒకరిని నియమించమని, వాళ్లకు బహుమానంగా ఇచ్చేది చాలా తక్కువ నగదు అని కె. కోటపాడు మండలం, చౌడువడ లో నిర్వహించిన గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ చులకనగా మాట్లాడిన ఓ వ్యక్తికి డిప్యూటీ సీఎం,పంచాయతీరాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు హితబోధ చేశారు.