రబీలో సాగు చేస్తున్న అన్ని రకాల పంటలకు సంబంధిత రైతులు ఈనెల 20 లోగా ఈ క్రాఫ్ చేయించాలని అద్దంకి వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన అద్దంకిలో కార్యాలయం నందు లోకల్ యాప్ తో మాట్లాడుతూ అన్ని పంటలను ఈక్రాప్ తో పాటు పిఎం కిసాన్ ప్రయోజనం పొందేందుకు ఈనెల 20 లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని అన్నారు. పకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే పొందే నష్టపరిహారం సున్నా వడ్డీ రాజీతో పాటు పండించిన పంట అమ్ముకునేందుకు ఈ క్రాఫ్, ఈ-కేవైసీ తప్పనిసరి అని రైతుల గుర్తించాలని వెంకటకృష్ణ తెలియజేశారు.