అనంతగిరి మండలం లంగుపర్తి పి. హెచ్. సి లో ఆశావర్కర్లను ఉద్దేశించి అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు బుధవారం మాట్లాడారు. కనీసవేతనం రూ. 26000/-రుపాయిలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు ఆశావర్కర్లను వర్తింప జేయాలనీ, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని, సి. హెచ్. డబ్ల్యూ లను ఆశా వర్కర్స్ గా తీసుకోవాలని, డిమాండ్ చేసారు. అనంతరం ఆసుపత్రి డాక్టర్ దివ్యని సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.