చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు అంటూ అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దేవరపల్లి పేతురు అనే వ్యక్తి ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతని కుమారుడు రమేష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నిచోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రమేష్ బాబు పోలీసులను ఆశ్రయించాడు. కాగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై జనార్ధన్ చెప్పారు.