ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో విష జ్వరంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ప్రసాద్ (32) స్థానికంగా రక్త పరీక్ష చేయించుకోగా టైఫాయిడ్ అని వచ్చింది. బుధవారం ఇంట్లో అపస్మారస్థితిలో ఉన్న ప్రసాద్ ను కుటుంబ సభ్యులు గమనించి సత్తెనపల్లిలోని ప్రైవేట్, ప్రభుత్వం ఆస్పత్రులకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు.