అవినీతికి దారి లేకుండా సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. గురువారం మండలంలోని కాశిందొర వలస సచివాలయ పరిధిలో గల గొర్లె సీతారాంపురం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్లి అక్కచెల్లెమ్మలను, అవ్వ తారలను, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో పేద ప్రజల కష్టాలను చూసి కరోన లాంటి అడ్డంకులు వచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్ళలో 95 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని తెలిపే కరపత్రాలను చూపిస్తూ సంక్షేమ పథకాలను గూర్చి ప్రజలకు వివరించారు. గ్రామంలో పలువురు రోడ్డు కావాలని ఎమ్మెల్యేను కోరారు, రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంబంగి లక్ష్మీ, వేణుగోపాలనాయుడు, జడ్పీటీసీ సంకిలి శాంతకుమారి, వైస్ ఎంపీపీ అరసాడ శంకర్రావు, ఎంపీటీసీ గొర్లి తిరుపతిరావు, బొబ్బిలి మండలం జెసిఎస్ కన్వీనర్ తమ్మిరెడ్డి దామోదర్ రావు, సచివాలయ కన్వీనర్లు పప్పుల అప్పారావు, పప్పుల సత్యం, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పాల్గొన్నారు.