తాడేపల్లి పరిధి కుంచనపల్లిలో తల్లి, ఏడు నెలల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. కుంచనపల్లి గంగానమ్మ పేట లో నివాసం ఉండే మిరియాల రమ్య శ్రీ (21), విజయ శ్రీ (7 నెలలు) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి రమ్య శ్రీ ఊరి వేసుకుని మృతి చెందగా కుమార్తె ఎలా మృతి చెందింది అనే విషయంపై అరా తీస్తున్నారు. తన భార్య గుండెపోటుతో మృతి చెందిందని భర్త పోలీసులకు తెలిపారు. భర్త చెప్పిన దానికి జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో మృతదేహాలు మార్చురీకి తరలించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.