ప్రతి వ్యక్తి జీవితంలో వెన్ను నొప్పి బాధించడం సహజం. అయితే ఈ అలవాట్లతో దాన్ని దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు కదిలించడం, సాగదీయడానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే కంప్యూటర్ తో పని చేసే వారు వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలంటున్నారు. స్మోకింగ్ కు దూరంగా ఉండాలని, తీసుకునే ఆహారంలో చేపలు, గుడ్డుసొన, జున్ను ఉండేలా చూసుకుంటే వెన్ను నొప్పిని దూరం చేయవచ్చని చెబుతున్నారు.