ప్రొద్దుటూరు పట్టణం ఎర్రగుంట్ల రోడ్డులోని జామియా మసీదులో ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ వైస్ చైర్మెన్ ఖాజా కౌన్సిలర్లు వైఎ్సమహ్మద్ గౌస్, మునీర్ డిమాండ్ చేశారు. బుధవారం కమిషనర్ వెంకట రమణయ్యను కలిసి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ..... శ్మశాన వాటికలో ప్రజల సౌకర్యార్థం అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మైనారిటీ నేతలు ఈద్రిస్ చాంద్బాషా అబ్దుల్, రసూల్, లిబర్టీ గౌబుసా, ఖదీర్, ఖాజా ఉస్మాన్ , రాజా తదితరులు పాల్గొన్నారు.