ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బియ్యం అక్రమ రవాణపై నిఘా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 02:49 PM

ప్రజలకు పంపిణీ చేసే చౌకబియ్యం అక్రమ రవాణపై నిరంతరం రెవెన్యూ వ్యవస్థ నిఘా పెట్టాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దారుకార్యాలయంలో ఆయన రెవెన్యూ, డీటీ, ఆర్‌ఐ వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొత్తపుంతలో పీడీఎస్‌ రైస్‌ను నూకలుగా మార్చి తరలిస్తున్న ఘటనలు వెలుగుచూశాయన్నారు. రేషన్‌ బియాన్ని పక్కదారి పట్టించే వారెవ్వరైనా ఉపేక్షించవద్దన్నారు. ప్రభుత్వం భూముల్లో ఆక్రమణలు జరిగితే సంబంధిత వీఆర్‌వోలదే బాధ్యత అన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com