కంబదూరు మండల కేంద్రం పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎన్ఫోర్స్మెంట్ వారి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం గతంలో వివిధ కేసులలో పట్టుబడిన 44 ద్విచక్ర వాహానాలకు వేలం పాట కార్యక్రమాన్ని ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వపు ఒప్పందపు వేలం పాట ద్వారా రూ. 6, 83, 000లు, వేలం పాటదారులు పాడిన వేలం ద్వారా రూ. 9, 58, 800లు, జిఎస్టీ ద్వారా రూ. 1, 72, 584లు వచ్చిందన్నారు. మొత్తం రూ. 11, 31, 384లు వేలం పాట ద్వారా వచ్చిందని తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజనాకు జమ చేస్తామని ఎస్సై చెప్పారు. ఈ వేలం పాట లో ఎన్పోర్స్మెంట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వేలం పాటదారులు పాల్గొన్నారు.