‘‘ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం దారుణం. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే పత్రి కలపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలి. జర్నలిస్టులను శత్రువు లుగా పరిగణించే ప్రభుత్వాల మనుగడ కష్ణం.’’ అని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర, విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో రూపొందించిన మీడియా డైరీలను గాంధీనగ ర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్‌లకు జర్నలిస్టులు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోందని, జర్నలిస్టుల భిక్షతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉందో అవగతముముతోందని ఆయన అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్దన్ అధ్యక్షతన నిర్వ హించిన కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, యూనియన్ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజే శ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చలపతిరావు, వసంత్, సామ్నా రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబ శివరావు, ఎలక్ర్టానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు శివ పాల్గొన్నారు.