టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అభిషేక్ ఫామ్ గురించి జట్టు యాజమాన్యం ఏమాత్రం ఆందోళన చెందడం లేదని త్వరలోనే అతను ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన సూర్యకుమార్అభిషేక్ ఫామ్ గురించి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వాళ్లను చూస్తేనే నాకు ఆందోళనగా ఉంది. అతను ఇంకా పరుగులు చేయలేదంటే, తర్వాతి మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది టీమ్ గేమ్. ఏడాది కాలంగా మా అందరి బాధ్యత తను తీసుకున్నాడు, ఇప్పుడు మేము తన కోసం నిలబడతాం. ఒకవేళ అతను విఫలమైతే, ఆ లోటును భర్తీ చేయడానికి మేమున్నాం అని స్పష్టం చేశాడు.ఈ టోర్నమెంట్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. అమెరికాపై గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలోనూ తొలి రెండు ఓవర్లలోపే వికెట్ కోల్పోయాడు.అంతకుముందు, భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అభిషేక్‌కు అండగా నిలిచాడు.అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. జట్టులో అతని స్థానంపై ఎలాంటి చర్చ జరగడం లేదు. నెట్స్‌లో బంతిని చక్కగా ఆడుతున్నాడు. త్వరలోనే అతను జట్టుకు అవసరమైన పరుగులు చేస్తాడు అని మోర్కెల్ తెలిపాడు. 2024 ప్రపంచకప్ రన్నరప్ అయిన దక్షిణాఫ్రికాపై అభిషేక్‌కు మంచి రికార్డు ఉంది. ఆ జట్టుతో 8 మ్యాచ్‌లు ఆడి ఒక హాఫ్ సెంచరీతో సహా 200 పరుగులు చేశాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa