టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర కు పోలీసులు అడుగడునా అడ్డుంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల లోకేష్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు తాజాగా లోకేష్ మాట్లాడే మైక్‌ను లాక్కున్నారు. గురువారం సంసిరెడ్డిపల్లెకు చేరుకున్న లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేష్ ను మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న బాషాపై దాడి చేసి గాయపరిచి మరీ పోలీసులు మైక్ లాక్కున్నారు. లోకేష్ నిలుచున్న స్టూల్‌ను కూడా లాక్కునేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. పోలీసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా లోకేష్ స్టూల్ మీదే నిలబడి నిరసన తెలుపుతున్నారు.