ప్రకాశం జిల్లా, కొండపి ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో పోలీసు శాఖ ఉలిక్కిపడింది. ఈ విషయం జిల్లావ్యాప్తంగా అలజడిరేపింది. పోలీసుల అవినీతి వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదుతోపాటు, 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చే విషయంలో నిందితుల నుంచి పోలీసులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొండపి ఎస్సై, కానిస్టేబుల్ అదే వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం వాటికి బలన్నిస్తోంది.