ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా వ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శింగనమలలో ఏర్పాటు చేసాన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్ , మండల అధ్యక్షుడు గంగాధర్ , వర్ధన్ బాబు మాట్లాడుతూ అనంతపురం నగరంలో రెండు రోజుల క్రితం నారాయణ జూనియర్ కళాశాలలో ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తుండడంతో విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు. ఈ ఆత్మహత్యా ప్రయత్నానికి కారణమైన నారాయణ కళాశాలను సీజ్ చేసి కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.