శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జేసీ చేతన్ శుక్రవారం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) అనంతరం కలెక్టరేట్ అధికారులతో జేసీ సమావేశమయ్యారు. క్యాన్సర్ కేసులు, ఆరోగ్యశ్రీలో నమోదవుతున్న కేసులు, ఐసీడీఎస్ పని తీరు, నాడు-నేడు ప్రగతిపై సమీక్షించారు. హైరిస్క్ గర్భిణులను తరలించే క్రమంలో చేపట్టాల్సిన సత్వర చర్యలను వివరించారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, బడి బయట పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పిం చాలన్నారు. ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వలంటీ ర్లతో సర్వే చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని 1, 299 పాఠశాలకు ప్రభుత్వం కేటా యించిన రూ. 9 కోట్ల నిధులను అత్యవసర పనులకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.