వైసిపికి ఓటమి భయంతోనే నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం పత్రిక ప్రకటన ద్వారా విమర్శించారు. పాదయాత్ర ఆగదు, జగన్ కు భంగపాటు తప్పదు అని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లు పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ అన్ని భద్రత చర్యలు తీసుకుందని విజయకుమార్ గుర్తు చేశారు. జగన్ పై వ్యతిరేకతతోనే చంద్రబాబు, లోకేష్ సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలియజేశారు.