త్రిపురలో రెండోసారి అధికారాన్ని అందుకోవడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునే విధంగా 'సంకల్ప్ పత్ర' పేరుతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇందులో ఆడపిల్లలు పుట్టిడితే బాలికా సమృద్ధి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 50,000 బాండ్ ఇస్తామని పేర్కొంది. పేదలకు రూ.5లకే భోజనాన్ని అందించనున్నామని తెలిపింది. వీటితోపాటు మరిన్ని హామీలు ఇచ్చారు. కాగా ఈనెల 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.