ఈ నెలాఖరు కల్లా ఇంటి పన్నులు వసూళ్లు పూర్తి చేయాలని కొరిసపాడు మండల పరిషత్ అధికారి సురేష్ బాబు ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కార్యాలయం నందు లోకల్ యాప్ తో మాట్లాడుతూ ఇప్పుడు వరకు కొరిసపాడు మండలంలో 2. 14 కోట్లకు గాను 1. 25 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. మిగిలిన బ్యాలెన్స్ ఉన్న ఇంటి పన్ను వసూళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని ఎండిఓ సురేష్ బాబు పేర్కొన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.