ప్రతి శుక్రవారం జగనన్న కాలనీలలో హోసింగ్ డే కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పుల్లలచేరువు మండలం మూలమడుగు తండాలో అధికారులు హోసింగ్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డీఎల్డిఓ బివిఎన్ సాయి కుమార్, తహసీల్దార్ కె. దాసు గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని కోరారు. హౌసింగ్ ఏఈ జాన్ సుందర్, డిఆర్డిఏ ఏరియా కోఆర్డినేటర్ లక్ష్మీ రెడ్డి, పి. ఆర్ ఏఈ నాగప్ప, ఎపియం వెంకటయ్య, ఏపీవో శైలజ, పంచాయితీ కార్యదర్శి నలగాటి శివ తదితరులు పాల్గొన్నారు.