జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో వేగంగా జరుగుతున్నాయి. మండల నాయకుల, సభ్యుల ఆధ్వర్యంలో నూతన సభ్యత్వం నమోదు మరియు రెన్యూవల్ చేస్తున్నారు. సభ్యత్వ నమోదు చేసుకునే వారు వారి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఫోటో తీసుకొని ఆయా మండల నాయకుల వారిని సంప్రదించాలని వారు కోరారు. రూ. 500 లతో రూ. 5లక్షల వరకు భీమా వర్తింపు వస్తుందని అన్నారు.