ప్రకాశం జిల్లా గిద్దలూరులో శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అతి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దయాకర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రచారం నిర్వహించాలని నాయకులు కార్యకర్తలు తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.