గుడ్లూరు మండలం చిన్న లాటరిపి, జానకంపేట గ్రామాలకు చెందిన పలువురు వికలాంగులకు నెల్లూరు టిడిపి పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ శుక్రవారం ట్రై సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులకు సమాన హక్కు కల్పించడం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. నిరంతరం కందుకూరు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు తన వంతు చేయూత అందిస్తూ రాజేష్ ముందుకు సాగుతున్నారు.