విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. రాజశేఖర్ పేర్కొన్నారు. గురువారం ప్రొద్దుటూరు స్థానిక ఎన్జీఓ హోంలో ఉమ్మడి కడప జిల్లాల పీడీఎస్ యూ కమిటీ సమావేశం రెండోరోజు నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులు, యువత సమస్యలపై మాట్లాడారు. సమావేశంలో పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, కోశాధికారి జోకీశ్వర్, నాయకులు రాహుల్, పండ్రెస్, నరేష్, సుభాషిణి, కుసుమ, వైష్ణవి, జ్యోతి, ప్రశాంత్, రిషి, తదితరులు పాల్గొన్నారు.