ప్రభుత్వ స్థానిక ఆసుపత్రిలో గురువారం మానవత సంస్థ ఆధ్వర్యంలో బ్రెడ్లు, గర్భవతులకు బిస్కెట్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. విశ్రాంత తహసిల్దార్ సి. వి. ప్రభాకరరెడ్డి మనవడు హయాన్స్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సహకారం అందించారు. ప్రతి నెలా 9వ లేది గర్భిణీకులకు పిరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం వివిధ గ్రామాల గర్భిణీలు పరీక్షల కోసం తరలివస్తారు. గురువారం జరిగిన పంపిణీ కార్యక్రమంలో వంద మందికి పైగా గర్భవతులకు పండ్లు, బిస్కట్లను పంపిణీ చేశారు. ప్రతినెలా మానవత సంస్థ ఇలాంటి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. కాగా ఆస్పత్రి సిబ్బంది మానవత సభ్యులకు, గాత ప్రభాకర్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వైద్యాధికారి లక్ష్మీ ప్రియ, గీత సి. వి. ప్రభాకరెడ్డి, మానవత సంస్థ చైర్మన్ టి. వి. రంగారెడ్డి మానవత సబ్బులు హరిశ్చంద్రారెడ్డి, రాఘవరెడ్డి, రామమోహన్ అత్యర్థ నారాయణ, చంద్రశేఖర రెడ్డి, సుబ్బరాముడు నాగేశ్వర్ రెడ్డి, ఆషావర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.