ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ప్రజల ఆదరాభిమానాలతో దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం స్థానిక 4వ సచివాలయం పరిధిలో గల 11వ వార్డు నుండి 13వ వార్డు వరకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొన్ని అనివార్య కారణాలు కారణంగా వాయిదా పడినట్లు కొత్తవలస ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.