డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు వీఆర్ఆర్ఆ కళాశాల కరస్పాండెంట్ సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, వాటి వలన కలిగే నష్టాలపై కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.